Site Logo
ABCDEFGHIJKLMNOPRSTUVWYZMore

HomeTeluguWallpapers -» Panthulu Gari Ammayi Movie Posters


Panthulu Gari Ammayi Movie Posters - Wallpapers

Posted on 18 March 2016, By Nagesh

Panthulu Gari Ammayi is a Telugu Movie starring Sai Kumar, Krishna Ajay Rao, Shravya, Bullet Prakash, Sadu Kokila and others. Movie is Directed by Sahaana H. S., Produced by Vara Prasad under Chandrakala Art Creations banner. Music is composed by Anoof Sileen.


విడుదల సన్నాహాల్లో "పంతులుగారి అమ్మాయి (ప్రేమకథ)" !!
కన్నడలో సంచలన విజయం సాధించిన "రోజ్" అనే చిత్రం తెలుగులో "పంతులుగారి అమ్మాయి" పేరుతో అనువాదమవుతోంది. "ప్రేమకథ" ట్యాగ్ లైన్.  డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో కృష్ణ అజయ్ రావు-శ్రావ్య  హీరోహీరోయిన్లు. బుల్లెట్ ప్రకాష్, సాధుకోకిల తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సహన హెచ్.ఎస్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రాన్ని శ్రీమతి చంద్రకళ సమర్పణలో.. చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వరప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీమతి అంచాల రాజేశ్వరి-ముద్దం రామచంద్రుడు సహ నిర్మాతలు. అనూప్ సిలీన్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో "లహరి మ్యూజిక్" ద్వారా విడుదలయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 
ఈ సందర్భంగా నిర్మాత వర ప్రసాద్ మాట్లాడుతూ..  "శివాజీ హీరోగా రూపొందిన "దొరకడు"తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన మా  చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్.. ఆ తర్వాత "దండుపాళ్యమ్ అలజడి" అనే అనువాద చిత్రాన్ని అందించింది, "పంతులుగారి అమ్మాయి" మా  సంస్థ నుంచి వస్తున్న మూడో చిత్రం, కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సొంతం చేసుకొంటుదనే నమ్మకం ఉంది.  బిజినెస్ పరంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంది.  ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ క్యారెక్టర్ చాలా హై లైట్ గా నిలుస్తుంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం"  అన్నారు.  
ఈ చిత్రానికి మాటలు: శ్రీసాయి, పాటలు: శ్రీసాయి- శ్రీమతి వెల్లంకి విజయలక్ష్మి, సహ నిర్మాతలు: శ్రీమతి అంచాల రాజేశ్వరి-ముద్దం రామచంద్రుడు, సమర్పణ: శ్రీమతి చంద్రకళ, నిర్మాత: వరప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే -దర్సకత్వం: సహన హెచ్.ఎస్!! 

Tags: Panthulu Gari Ammayi Photos, Panthulu Gari Ammayi Pics, Panthulu Gari Ammayi Photo Gallery, Panthulu Gari Ammayi Stills, Panthulu Gari Ammayi Pictures,



Follow us on

Home Contact Us Disclaimer Terms of use Privacy Policy

ęCopy Right 2017 MatineeStars.in